మాట్లాడుతున్న జెడ్‌పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
అన్ని రంగాల్లో జిల్లా పరిషత్ అగ్రస్థానం
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా పరిషత్ ను అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కషి చేస్తూ జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ గా రెండేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఉద్యోగులు ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఆనం అరుణమ్మ, విజరు కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూరల్ జడ్పిటిసి గా గెలుపొందిన తనకు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, జెడ్పిటిసి సభ్యులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, జిల్లా పరిషత్ ను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పరిపాలనాపరంగా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కారుణ్య నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలను పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. 30 రోజుల పాటు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని అనేక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు విజయ దీపిక పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, బోధనాపరమైన సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘం, జిల్లా పరిషత్ సాధారణ నిధుల ద్వారా అనేక అభివద్ధి పనులు చేపట్టినట్లు ఆమె వివరించారు. రాబోయే మూడేళ్ల పదవీకాలంలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించి, జిల్లా పరిషత్ అభివద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, విజరు కుమార్ రెడ్డి దంపతులను జడ్పిటిసి సభ్యులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. తొలుత కార్యాలయానికి విచ్చేసిన ఆనం అరుణమ్మ, విజరు కుమార్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా, జిల్లా పరిషత్ ఉద్యోగులు పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానించారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి, వైస్ చైర్పర్సన్లు శ్రీహరికోట జయ లక్ష్మమ్మ, చిగురుపాటి లక్ష్మీ ప్రసన్న, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ లు రంగవర ప్రసాద్, అశోక్ కుమార్, డ్వామా పిడి వెంకట్రావు, జడ్పిటిసి, ఎంపీపీ సభ్యులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు.










