అన్ని గ్రామాలకు రోడ్ల కల్పనే లక్ష్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి వి . సురేష్ కుమార్
రాయచోటి
జిల్లాలో అన్ని గ్రామాలలో రోడ్లను వేయించడమే తమ లక్ష్యమని జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి వి . సురేష్ కుమార్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, భవనాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో రోడ్లు వేశారు. ఇంకా ఎన్ని ప్రతిపాదనలో ఉన్నాయి.. అందుకు మంజూరైన నిధులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనులు వంటి వాటి గురించి ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
జిల్లాలో ఇఇ, డిఇ, ఎఇల వివరాలు తెలపగలరు?
జిల్లావ్యాప్తంగా ఇఇలు రాయచోటి, మదనపల్లె, రాజంపేటలో ఉన్నారు. డిఇలు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెలో ఉన్నారు. ప్రాజెక్టు డిఇలు రాయచోటి , రాజంపేట, మదనపల్లె, తంబళ్లపల్లెఓ ఉన్నారు. మండలానికి ఒకరు చొప్పున 30 మంది, ప్రాజెక్టు ఎఇలు నలుగురు ఉన్నారు.
జిల్లాలో సచివాలయం ఎన్ని మంజూరయ్యాయి?, ఎన్ని పూర్తయినాయి
జిల్లా వ్యాప్తంగా 397 సచివాలయాలు మంజూరయ్యాయి. ఒక సచివా లయానికి రూ. 40 లక్షల బడ్జెట్‌తో మంజూరు చేశారు. ఇప్పటివరకు 254 సచివాలయాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో పనులు జరుగుతున్నాయి.
రైౖతు భరోసా కేంద్రాలు ఎన్ని మంజూరయ్యాయి ?ఎన్ని పూర్తి చేశారు?
జిల్లా వ్యాప్తంగా రైతుబంధు కేంద్రాలు 386 మంజూరయ్యాయి. ఇప్పటివరకు 181 పూర్తయ్యాయి. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.21. 80 లక్షల అంచనాతో మంజూరయ్యాయి. మిగిలిన రైతు భరోసా కేంద్రాలు వివిధ దశలలో పనులు జరుగుతున్నాయి. విలేజ్ హెల్త్ క్లీనిక్ 297 మంజూరయ్యాయి. ఒక్కో క్లీనిక్‌కు 17.50 లక్షలు కేటాయించారు. ఇప్పటి వరకూ 95 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
గడపగడపకు మన ప్రభుత్వం పనులు వివరాలు తెలపండి?
జిజిఎంపిలో భాగంగా జిల్లాలో 574 రోడ్లకు రూ. 1348. 73 లక్షలు కేటాయించారు. రాయచోటి డివిజన్‌లో రూ. 317 . 70 లక్షలతో 120 రోడ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 110 పూర్తయ్యాయి. రాజంపేట డివిజన్ లో రూ. 469.70 లక్షలతో 167 రోడ్లు మంజూ రయ్యాయి. 30 పూర్తయ్యాయి. మదనపల్లి డివిజన్‌లో 292 రోడ్లకు రూ. 561.33 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటివరకు 43 రోడ్లు వేశాం. మిగిలినవి కూడా పనులు జరుగుతున్నాయి . జిల్లాలో గహ నిర్మాణ శాఖ లే అవుట్ల ఆర్చీలు పనులు చేపడుతున్నాం. 20 అడుగుల రోడ్డురూ. 4.15 లక్షలు , 30 అడుగులు రోడ్డు రూ 4.50 లక్షలు రూపాయలతో ఆర్చీలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నాం.










