ప్రజాశక్తి-రెడ్డిగూడెం
గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కష్ణ ప్రసాదు అన్నారు. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట సచివాలయం పరిధిలోని సీతారాంపురం తండాలో ఆయన మంగళ వారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నేరావుపేట సచివాలయం పరిధిలో వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటివరకు రూ.9,87,62, 897 లను లబ్ధిదారులకు చెల్లించినట్లు వెల్లడించారు. అన్నేరావుపేటలో సచివాలయం, వెల్ నెస్ సెంటర్, ఆర్.బి.కె నిర్మాణాలు, డిజిటల్ లైబ్రరీ, నాడు-నేడు కింద అభివద్ధి పనులకు, సీసీ డ్రెయిన్లకు, రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.5,53,48,572లు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మో హన్ రెడ్డి సంక్షేమంతో పాటు అభివద్ధి కూడా పెద్దపెట్టవేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










