Aug 07,2022 22:35

జగ్గయ్యపేట : మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్‌కి ఆదివారం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన నాయకులు, ప్రజల సహకారంతో గ్రామ పార్టీ అధ్యక్షులు గింజుపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 100 టిక్కిల బియ్యాన్ని వితరణగా అందజేశారు. ఈ సందర్భంలో శ్రీరాం రాజగోపాల్‌ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్‌ ఎంతోమంది ఆకలి తీరుస్తోందని అన్నారు.