Oct 20,2022 22:54

ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్‌లో 94వ రోజు అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్‌ 52 వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నక్యాంటీన్లో అన్న ప్రసాదం నిర్వహించారు. ముందుగా కేక్‌ కటింగ్‌ చేసినా అనంతరం అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవాడ పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్‌, శ్రీరాం చిన్నబాబు, కొఠారు సత్యనారాయణ ప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం సాయి ప్రసాద్‌, మేక వెంకటేశ్వర్లు, ఎలమంచిలి రాఘవ, మైనేని రాధాకష్ణ, కట్టా వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.