ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : కార్మిక, ప్రజా సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె భాగంగా సోమవారం కార్మికులు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ కార్మికులు వినూత్నంగా పాల్గొన్నారు. నడుముకు చుట్టుకుని అర్ధనగ్నంగా మారి ప్లే కార్డులు చేతపట్టుకుని సమ్మె ర్యాలీలో ముందు భాగంలో నడిచారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని ప్రైవేటీకరించడం నిరసించారు. ఈ ర్యాలీలో న్యూ టౌన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గురురాజ, ముర్తుజా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు ఆర్.వి నాయుడు, మునిసిపల్ యూనియన్ నగర అధ్యక్షులు ఏటీఎం.నాగరాజు ఈ సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ రెగ్యులర్ కార్మికులకు మెరుగైన పదకొండవ పిఆర్సి అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్ చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని, కోవిడ్ మరియు మలేరియా కార్మికులకు పని భద్రత కల్పించి, బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికులందరికీ రక్షణ పరికరాలు, పనిముట్లు యూనిఫాం, సకాలంలో ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని నినదిస్తూ సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి తిరుమలేశు, సహాయ కార్యదర్శి బత్తల ఆదినారాయణ, సలహా కార్యదర్శి శేషేంద్రకుమార్, కమిటీ సభ్యులు నాగభూషణ, భవాని, అక్కులప్ప, అరుణమ్మ, ఆది, నారాయణస్వామి, జయరామ్, హిమాంబీ, శివ, ప్రభాకర్, రాములమ్మ, మరియు మలేరియా కార్మికులు, కోవిడ్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.










