Jan 01,2023 09:13

ట్రోఫీ అందుకుంటున్న విజేత జట్టు

           కదిరి టౌన్‌ : రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో అనంతపురం జట్టు జయకేతనం ఎగురవేసింది. రూరల్‌ మండలం ఎరుకులవాండ్లపల్లి సమీపంలోని హరీష్‌ పాఠశాలలో హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌, హరీష్‌ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌-19 బాలికల హ్యాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా మొదట మ్యాచ్‌ టై అయింది. తర్వాత 5 నిమిషాలు జరిగిన మ్యాచ్‌ లో ఒక గోల్‌ తేడాతో అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించింది. విజేతలకు కదిరి ఎంవిఐ వరప్రసాద్‌ ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని హరీష్‌ స్కూల్లో మొదటి సారి రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించి ముందకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎంఎస్‌.కిరణ్‌, హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రామాంజనేయులు, జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి ముస్తఫా కమాల్‌ బాషా, సభ్యులు ప్రసన్న కుమార్‌, ఖాదర్‌ వలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.