మాట్లాడుతున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
'ఆనం'పై 'నేదుమల్లి' కామెంట్స్
రాపూరు:వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డిపై నేదుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి రాజకీయ విమర్శలు చేశారు. స్థానిక టీజీపీ అతిథి గహంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాపూర్‌లో నిర్వహించాల్సిన గ్రీక్స్ పోటీలను సమయభావం వల్ల మౌలిక వసతులు రాపూరు నుంచి నెల్లూరుకు మార్చారని, తన సొంత ఖర్చులతో వాహనాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను నెల్లూరుకి తరలిస్తామన్నారు. వారికి కావలసిన అన్ని సదుపాయాలను తామే కల్పిస్తామని తెలియజేశారు.ఇప్పటికైనా ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి పార్టీని విడిచిపెట్టి తన నిర్ణయం ఏమిటో నిర్ణయించుకోవాలన్నారు. దీంతో ప్రజల్లో ఆయోమయం తొలుగుతుందన్నారు.సిఎం తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివద్ధికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.










