ఆనం మద్దతు శుభపరిణామం
ప్రజాశక్తి-ఉదయగిరి : వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణ రెడ్డి టిడిపి కార్యాలయం రావడం నారా లోకేష్ బాబు పాదయాత్రకు మద్దతు తెలపడం శుభపరిణామమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్ పి.చెంచలబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆనం రాకతో జిల్లాలో జిల్లాలో టిడిపి మరింత బలోపేతం అవుతుందని, అనేకమంది వైసిపి నాయకులు టిడిపిలో చేరికకు సిద్ధంగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో వైసిపి ఖాళీ అవుతుందని చంద్రబాబు నాయకత్వంపై అనేకమంది ఆకర్షణగా అవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం రాజధాని లేకుండా పోయిందని, ప్రజలు నాయకులు రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు. నారా లోకేష్ జిల్లా పర్యటన అందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సిహెచ్ బయన్నయాదవ్, వెంకటస్వామి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.










