Apr 05,2023 21:31

నివాళులర్పిస్తున్న జెసి

నివాళులర్పిస్తున్న జెసి
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి
నెల్లూరు:దేశ స్వాతంత్య్ర ఫలాలు అన్నీ వర్గాల ప్రజలకు ఆందాలన్న లక్ష్యంతో, సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కషి చేసిన మహనీయులు డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ అని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు సమ సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ పేర్కొన్నారు. బుధవారం డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ 116వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణంలో డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, తదితరులతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర ఫలాలు అన్నీ వర్గాల ప్రజలకు ఆందాలన్న లక్ష్యంతో, సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కషి చేసిన మహనీయులు డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ అని అన్నారు. ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వన్నె తెచ్చిన మహనీయులు డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ అని, వారు కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ఆర్ధిక శాఖ మినహాయించి మిగిలిన ప్రధాన శాఖలన్నీ నిర్వర్తించడం జరిగిందన్నారు.
కేంద్ర కార్మిక శాఖామంత్రి గా పనిచేసిన సమయంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు, కార్మికుల ఉద్యోగ భద్రతకు కషి చేశారన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేసిన సమయంలో ఆహార సంస్కరణల తీసుకువచ్చి హరిత విప్లవానికి నాంధి పలికారని, అలాగే రక్షణ శాఖామంత్రిగా పనిచేసిన సమయంలో బంగ్లాదేశ్‌ ఏర్పాటు కావడానికి కారకులు అయ్యారని ఆయన చెప్పారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి దేశానికే ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. అదేవిధంగా కార్మిక, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగిందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు సమ సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ చేపట్టిన అన్నీ పదవులకు వన్నె తెచ్చిన మహనీయులు, వారు తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే నేడు అణగారిన వర్గాల హక్కుల పరిరక్షకునిగా దేశ ప్రజల హదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేసి ఆయన ఆశయాల సాధనకు కషి చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వెంకటయ్య, ఎపిఎంఐపి పిడి శ్రీ శ్రీనివాసులు, వివిధ దళిత సంఘాల నాయకులు మురళి, కుడుముల సుబ్బారావు, బాలచెన్నయ్య, ప్రసన్నగణపతి, సుబ్బయ్య, పల్లం వెంకటయ్య, మోహన్‌ అంబేడ్కర్‌, పెంచలయ్య, సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజయకుమార్‌ తదితరులు మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ సమసమాజ స్థాపనకు చేసిన కషిని, వారి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బా రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి కనక దుర్గా భవానీ, ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐఓ వర ప్రసాద్‌, డిసిహెచ్‌ ఎస్‌. రమేష్‌ నాథ్‌, వివిధ దళిత సంఘాల నాయకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.