Mar 26,2023 22:16

గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల బట్ట కట్టుకుని దీక్ష చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : కేంద్రంలో అధికారంలో ఉన్నా మతతత్వ బిజెపి చేస్తున్న అణచివేత రాజకీయాలపై కాంగ్రెస్‌తో పాటు దేశ పౌరులందరు పోరాటాం చేయాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్‌ పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీపై పార్లమెంట్‌లో అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నల్ల రిబ్బన్‌ ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫైవ్‌ ల్యాంప్‌ సర్కిల్‌ వద్ద గాంధీ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని సంకల్ప సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సుధాకర్‌, సీనియర్‌ నాయకులు బాలాజీ మనోహర్‌ మాట్లాడుతు కేంద్రంలో అధికారంలో ఉన్నా మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. ఇది తప్పు అని చెప్పిన వారిని దేశ ద్రోహులుగా చిత్రికరిస్తు అణిచివేస్తోందన్నారు. భారత్‌ జోడో యాత్రతో అన్ని వర్గాల ప్రజలు రాహుల్‌కు మద్దతు తెలిపారని దీనిని చూసి ఓర్చుకోలేక రాహుల్‌ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్‌ గట్టిగా పోరాడుతోందని అందుకే కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని విమర్శించారు. రాహుల్‌ గాంధీ పై బనాయించిన అక్రమ కేసును ఎత్తివేయాలన్నారు. ఆయనపై విధించిన అనర్హత వేటును ఎత్తివేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. నిర్బంధాలకు, అక్రమ కేసులకు భయపడే ప్రశక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు హరిత, పట్టణ అధ్యక్షులు శ్యామ్‌ కిరణ్‌, లేపాక్షి మండల కన్వీనర్‌ రామాంజనేయులు, రూరల్‌ కన్వీనర్‌ హనుమంతరాయుడు, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, పట్టణ జనరల్‌ సెక్రెటరీ కలీం, పట్టణ వైస్‌ ప్రెసిడెంట్‌ షాహిద్‌, బీ బ్లాక్‌ అధ్యక్షుడు గంగాధర్‌, నాయకులు ఫైరోజ్‌, అమనుల్లా, అనంత్‌ కుమార్‌, యూనూస్‌, జమీవుల్లా, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.