Jun 21,2023 19:26

యోగా గురించి మాట్లాడుతున్న దృశ్యం

యోగా గురించి మాట్లాడుతున్న దృశ్యం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెల్లూరు:నెహ్రూ యువకేంద్ర సహకారంతో పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ మహిళా కాలేజ్‌ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆకుల మహేంద్రరెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 2014 డిసెంబర్‌ 11వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆమోదించి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించారన్నారు. ముందుగా యోగా మాస్టర్‌ ముత్యాల రవీంద్ర విద్యార్థులచే యోగాసనాలు చేయడం జరిగింది.
శ్రీరామరాజు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ పేర్నపాటి శ్రీరామరాజు మాట్లాడుతూ భారతదేశంలో వేల సంవత్సరాల క్రిందట యోగా పుట్టిందని భావిస్తారు. దేశంలో పురాతన కాలంలో ఋషులు యోగాను అభివద్ధి చేసి, ఆరోగ్యకరమైన జీవనశైలికి దానిని మరో పేరుగా మలిచారని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా మనిషి శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక, ఆధ్యాత్మిక భావనలను కూడా సానుకూల పరుస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.మురళీమోహన్‌ రాజు, ఇంచార్జి ప్రిన్సిపాల్‌ ఎ.వెంకటేశ్వర్లు, ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఆఫీసర్స్‌ బి.ప్రసన్న, జి.కరుణ కుమారి, టి.భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.