ప్రజాశక్తి-పెనుకొండ చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ హుస్సేన్‌పీరా తెలిపారు. శనివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో నలుగురిని అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వాటి విలువ దాదాపు 17 లక్షల ఉంటుందని తెలిపారు. నిందితులు దాదాపు 29 దొంగతనం కేసుల్లో 320గ్రాములు బంగారం, 630 గ్రాములు వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలోని మడకశిర, పెనుకొండ, రొద్దం తదితర మండలాల్లోని గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో, పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ ముఠాకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని,మరో ఇద్దరు ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం పావుగడ తాలూకాకు చెందిన బొమ్మలాట ఆంజనేయులు, నరేష్, రాఘవయ్య, శేషగిరిరావు, వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారన్నారు. వీరిలో ఆంజనేయులు, నరేష్ అన్నదమ్ములన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ నిందితులను పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి సీఐ కరుణాకర్ ధర్మవరం ట్రాఫిక్, సిసిఎస్ ఇన్‌ఛార్జి సిఐ వహీద్‌బాషా, కియా ఎస్సై వెంకటరమణ, రొద్దం ఎస్‌ఐ నాగస్వామి, సిబ్బంది మారుతి, ఆదినారాయణ, నాగరాజు, దస్తగిరి, రామకృష్ణ, పవన్‌ను అభినందించినట్లు తెలిపారు. అంతేగాకుండా వీరికి రివార్డులు ఇవ్వడానికి ఎస్పీకి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐ వహీద్‌బాషా, పెనుకొండ సీఐ కరుణాకర్, మడకశిర సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐలు రమేష్‌బాబు, నాగస్వామి, వెంకటరమణ, నాగేంద్ర, నాగేంద్ర, దస్తగిరి, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ హుస్సేన్‌పీరా










