రాజంపేట అర్బన్ : మాతా శిశు సంరక్షణ అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమవుతోందని, అలాంటి అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని మాతా శిశు సంరక్షణ శాఖ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ రవిచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన రాజంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోయినపల్లి, తాళ్లపాక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ సంపూర్ణ పోషణ, బాలామృతం వాటి విశిష్టతలను వివరించారు. అనంతరం హేమాద్రిపల్లె అంగన్వాడీ కార్యకర్త పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిడిపిఒ నిర్మల, బోయినపల్లి సూపర్వైజర్ పార్వతమ్మ, ప్రాజెక్ట్ అసిస్టెంట్ రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు రాజేశ్వరమ్మ, నాగ సులోచన, రేవతి, కృష్ణవేణి, వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.










