Jan 06,2023 21:25

సమస్యను కలెక్టర్‌కు వివరిస్తున్న సిఐటియు నాయకులు

           హిందూపురం : అర్హత ఉన్న అంగన్‌వాడీలకు ప్రభుత్వ జిఒ మేరకు పదోన్నతులు కల్పించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం స్థానిక జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో కలెక్టర్‌ బంసత్‌కుమార్‌ను సిఐటియు ఆధ్వర్యంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ హెల్పర్లు, వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. అయితే ఇందులో కొన్ని సెంటర్ల వారు కోర్టుకెళ్లారన్నారు. ఇంతవరకు ఎలాంటి తీర్పు రాలేదన్నారు. కానీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు తీసుకుంటున్నారన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలని, అదేవిధంగా మీకు అనుకూలంగా వస్తే మీరు ఉండవచ్చు, లేనిపక్షంలో వారికి అనుకూలంగా వస్తే మీరు ఉద్యోగం నుండి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని లేఖలు తీసుకుంటున్నారన్నారు. పదోన్నతులు కల్పించి, కోర్టు తీర్పు వచ్చే ఎలాంటి నియామకాలు చేపట్టరాదని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, కోశాధికారి శిరీషా, సెక్టార్‌ లీడర్‌ వరలక్ష్మి, సిఐటయు పట్టణ ఉపాధ్యక్షులు అత్తార్‌ బాబా, కమిటీ సభ్యులు చంద్ర, కల్లూరు స్టాండ్‌ యూనియన్‌ కార్యదర్శి రఫీ, నాగేష్‌, నవీన్‌, నారాయణప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.