Mar 15,2023 22:04

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

పుట్టపర్తి రూరల్‌: అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంం వారిని మోసం చేసిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్‌ వెంకటేష్‌ విమర్శించారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇఎస్‌ వెంకటేష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి దిల్షాద్‌ తదితరులు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూట్‌ ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో మార్చి 20 న విజయవాడ అలంకార్‌ సెంటర్లో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీదేవి, లావణ్య, చంద్రకళ, శోభ, సరస్వతి, రమణమ్మ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.