Feb 03,2023 22:09

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 6న సత్యసాయి జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌ కోరారు. శుక్రవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు బావమ్మ, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి పాల్గొన్నారు. ఈసందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్‌ కు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పేస్‌ యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అంగనవాడీల సమస్యలపై నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు వరలక్ష్మి, పార్వతమ్మ, నాగమణి, నీరజ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.