రాయచోటి టౌన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గ్రాట్యూటీ ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పునిచ్చి ఏడాదూనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాయచోటి ప్రాజెక్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.సిద్దమ్మ, డి.భాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రాష్ట్ర కమిటి పిలుపు మేరకు గ్రాట్యూటీ ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షౌష్టికాహార లోపరహితంగా మార్చడానికి ప్రతి ఇంటికి నిర్విరామంగా అంగన్వాడీలు సుధీర్ఘంగా సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను గౌరవ వేతనం పొందే వారిలాగా చూస్తున్నారు తప్ప వర్కర్లుగా కార్మికులుగా గుర్తించలేని పేర్కొన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ ఇవ్వక మభ్యపెడుతున్నారని తెలిపారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న జిఒలు కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ పనిభారం పెంచుతున్నారని విమర్శించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ఫయాజ్ మాట్లాడుతూ పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు రూ.26 వేలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సిసికి అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు విజయమ్మ, ఉమా సుమలత, శంకరమ్మ, మంజుల, ఇందిరమ్మ, రమీజా, శోభ, పావని, బైరమ్మ, పార్వతి, సుబ్బమ్మ, రెడ్డెమ్మ, రాములమ్మ, యశోద, లక్ష్మిదేవి, వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.










