అంగన్‌వాడీ లబ్ధిదారులకు అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని బండగనిపల్లి సచివాలయం పరిధిలోని కొత్తపల్లి ఎస్‌టి కాలనీ అంగన్‌వాడీ లబ్ధిదారులకు పంచాయతీ సర్పంచ్ లక్కు రమణమ్మ శుక్రవారం సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే బాలింతలు, గర్భిణులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రానికి హాజరై ప్రతీరోజూ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక పౌష్టికాహారం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిరక్షణ కూడా అంగన్‌వాడీ సెంటర్లో బాధ్యతగా తీసుకుంటారని అంగన్‌వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్కు.రవి, పంచాయతీ కార్యదర్శి చినబాబు, మహిళా సంరక్షణ కార్యకర్త సాబియా, డిజిటల్ అసిస్టెంట్ పవన్, అంగన్‌వాడీ కార్యకర్త అమరావతి, బాలింతలు, గర్భిణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










