అంగన్‌వాడీ కేంద్రంలో వైద్యశిబిరం
ప్రజాశక్తి-కావలి : డాక్టర్ రామ్‌సెంటర్ విశ్వోదయ ఆధ్వర్యంలో శనివారం వెంగళరావునగర్ కొత్త శివాలయం దగ్గర అంగన్‌వాడీ కేంద్రంలో వైద్యశిబిరం నిర్వహించారు. వెంగళరావు నగర్ అర్భన్ హెల్త్ సెంటర్ డాక్టర్ రమ్య మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, కిషోర్ బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని, గర్భిణులు రక్తహీనత లేకుండా చూసుకోవాలని, లింగవివక్షత ఉండ రాదని అవగాహన కల్పించారు. తదుపరి డాక్టర్ రామ్ సెంటర్ విశ్వోదయ వారు ఐరన్ ఫోలిక్, కాల్షియం, విటమిన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహరరెడ్డి, డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రసాద్, ఎ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.










