ఫొటో : అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ చేస్తున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్
అంగన్‌వాడీ కేంద్రంలో ఎంపిడిఒ తనిఖీ
ప్రజాశక్తి-ఉదయగిరి : 10వ తేదీ లోపు చిన్నారుల వివరాలను యాప్లో నమోదు చేయాలని ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక యాదవ్‌పాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపిడిఒ ఐజాక్ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితి పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు 10వ తేదీ లోపు చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితి పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీల ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం రికార్డులను పిల్లల హాజరు శాతాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త చాన్‌బేగం, సచివాలయ సిబ్బంది నారాయణ పాల్గొన్నారు.










