ఫొటో : అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపిడిఒ
అంగన్‌వాడీ కేంద్రంలో ఎంపిడిఒ పరిశీలన
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రంలోని అరుంధతీయవాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం ఎంపిడిఒ శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. అలాగే 0 నుండి 5 సంవత్సరాల పిల్లల బరువును పరిశీలించి పలు సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ రాజేశ్వరీ, అంగన్‌వాడీ టీచర్ ఉషారాణి తదితరులున్నారు.










