Sep 26,2023 20:46

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీ కార్మికులపై దమన కాండ
-సిఐటియు రూరల్‌ కమిటీ పిలుపు
ప్రజాశక్తి-నెల్లూరు:అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన చలో విజయవాడ పిలుపులో భాగంగా విజయవాడలో శాంతియుతంగా ధర్నా చౌక్‌ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ పై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత లాఠీ చార్జీ చేసి పోలీస్‌ స్టేషన్‌ కు వందలాదిమంది అంగన్వాడి వర్కర్స్‌ ను తరలించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హేయమైన చర్య ను వ్యతిరేకిస్తూ. సిఐటియు రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌ మాట్లాడుతూ. ఒకవైపు పార్లమెంట్లో 33 శాతం మహిళా బిల్లు అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేస్తూనే మరోవైపు మహిళల అయినటువంటిఅంగన్వాడి సెంటర్‌ లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ బీసీ పేద మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత దాడి చే యించి పోలీస్‌ స్టేషన్‌ తరలించడం సిఐటియు రూరల్‌ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
సిపిఎం రూరల్‌ కార్యదర్శి కామ్రేడ్‌ బత్తల కష్ణయ్య మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి గత ఎన్నికల్లో అంగన్వాడీ పర్మినెంట్‌ చేస్తానని, కనీస వేతనం అమలు చేస్తానని చేసిన హామీని అమలు చేయాలని అంగన్వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వారిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడం, తీవ్రంగా కొట్టించడం, వాహనాలలో కుక్కడం చాలా దారుణమన్నారు. సిఐటియు రూరల్‌ అధ్యక్షులు కొండ ప్రసాద్‌ మాట్లాడుతూ. వారికి మద్దతుగా నిరసన చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మీడియం బాబురావును పలువురు సిపిఎం నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సమస్యలు పరిష్కరించే దానీకీ బదులునిర్బంధించడం, దాడులు చేయడం, కేసులు బనాయించడం దుర్మార్గమని, ఇటువంటి చర్యను ప్రజలు ప్రజాతంత్ర వాదులు మేధావులందరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. సిఐటియు కార్యదర్శి వర్గ సభ్యులు దేవతా డి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.ఇప్పటికైనా అంగన్వాడి వర్కర్స్‌ కు గ్రాడ్యూటీ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అందజేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అందరినీ పర్మినెంట్‌ చేయాలని,రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, అధిక ధరలకు అనుగుణంగా జీతాలు కనీస వేతనంగా రూ.26 వేలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సెంటర్లకు అద్దెలు, టి ఏ బకాయిలు, పెరిగిన ధరలకు అనుగుణంగా జగనన్న సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను, గ్యాస్‌ ఖర్చులను ఇవ్వాలని , పేస్‌ యాప్‌ లు, పనిభారాలు తగ్గించాలని ఈ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి అంగన్వాడీలను అరెస్టు చేసి నిర్బంధించాలని అనుకోవడం దారుణమన్నారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు,శాఖ కార్యదర్శి ఎస్‌కె ఖాలేషా,ఆటో వర్కర్స్‌ నాయకులు కష్ణారెడ్డి, కుమార్‌ ,వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.