ప్రజాశక్తి-మండపేట
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మండపేటలో చేపట్టిన బైక్ ర్యాలీని యుటిఎఫ్ జిల్లా నాయకులు కె.గోపాల కృష్ణారెడ్డి బుధవారం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగనావాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.కృష్ణవేణి మాట్లాడుతూ ఈనెల 3, 4 తేదీల్లో జరిగే జిల్లా మొదటి మహాసభలను విజయవంతం చేయాలన్నారు. మూడో తేదీన మధ్యాహ్నం మండపేట స్థానిక బస్టాండ్ నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ప్రదర్శన అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డులో బహిరంగ సభ జరుగుతుం దన్నారు. బహిరంగ సభకు ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మలు హాజరవు తారన్నారు. పెద్ద ఎత్తున అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రతినిధుల సభ బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో ప్రారంభమై నాలుగో తేదీ సాయంత్రంతో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐ టియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.దుర్గమ్మ, ఎం.బలరాం, డి.ఆదిలక్ష్మి, సిహెచ్.రాణి, రామలక్ష్మి, కె.నరేంద్ర, వి.నాగేంద్ర ప్రసాద్, బి.కొండసూర్య కుమారి తదితరులు పాల్గొన్నారు.










