నియామక పత్రాలను అందిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
రాజంపేట రూరల్ : టి.సుండుపల్లి మండలంలో అంగన్వాడీ ఆయా పోస్టులకు ఎంపికైన మహిళలకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి నియామక పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ అంగన్వాడీ కేంద్రాలలో చదువుకుంటున్న పిల్లలను తమ పిల్లలుగా భావించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహా రాన్ని తప్పనిసరిగా పిల్లలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి దుర్గాప్రతాప్ నాయుడు, ఉపసర్పంచ్ నరసింహారెడ్డి, భీమ రాజు, దొరబాబు పాల్గొన్నారు.










