ప్రజాశక్తి - చందర్లపాడు(ఎన్‌టిఆర్‌జిల్లా) : చందర్లపాడు గ్రామంలో ఎన్‌ఆర్‌యుఎమ్ నిధులు రూ.12 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు - సమాంతర అభివృద్ధి కూడా ఉండేలా గ్రామాలలో సచివాలయ భవనాలు -రైతు భరోసా కేంద్రం భవనాలు -అంగన్వాడీ భవనాలు- ఆరోగ్య కేంద్రాల భవనాలు - నాడు నేడు లో భాగంగా పాఠశాల అభివద్ధి లాంటివి కూడా చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ, జడ్పిటిసి సభ్యులు ముక్కపాటి నరసింహారావు, నందిగామ ఏఎంసీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, స్థానిక వైసిపి నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, రాయల జానకిరామయ్య, వైసిపి కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, శాఖమూరి వెంకటకుమారి, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.










