Jan 29,2023 22:47

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : అంధులకు స్ఫూర్తిదాయకుడిగా లూయిస్‌ బ్రెయిలీ నిలిచాడని అంధుల రాష్ట్ర సంఘం కార్యదర్శి జలంధర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని అంధులు స్థానిక సాయి ఆరామంలో సమావేశమై లూయిస్‌ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ అంధులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షఫీ, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నాగరాజు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంకె రామాంజనేయులు, నాయకులు హరినాథ్‌ రెడ్డి, క్రిష్టప్ప, గంగన్న, అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.