Jan 04,2023 22:34

సర్టిఫికెట్‌ అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - హిందూపురం : అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ బ్రెయిలీ అని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అన్నారు. బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో అంధులకు వివిధ క్రీడ పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి బుధవారం పట్టణంలోని ఎంజిఎం మైదానంలో సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల వయోవద్దుల సంక్షేమ శాఖ చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పటాన్‌, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల వికలాంగుల సంక్షేమ శాఖ సూపరింటెండ్‌ రమణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు బ్రెయిలీ చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు వేణుగోపాల్‌ రావు, ప్రభుత్వ అంధ ఆశ్రమ పాఠశాల సేవామందిర్‌ ప్రిన్సిపల్‌ కరీముల్లా, ఎమ్‌జిఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్రాజ్యం, శ్రీ సత్యసాయి జిల్లా విభిన్న ప్రతిభా వంతుల అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాము, కోశాధికారి యల్లప్ప తదితరులు పాల్గొన్నారు.