వాల్మీకిపురం : పేద విద్యార్థులందరూ ఉన్నత స్థితికి చేరాలనే ధ్యేయంతోనే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలు క్రమ శిక్షణను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం అలవాటు చేసుకోవాలన్నారు. నైతిక విలు వలను పెంపొందించుకోవాలని, నైతిక విలువలతోనే వ్యక్తిత్వ వికాసం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరి తలరాతను మార్చేది విద్యేనని, చదువులో పోటీతత్వాన్ని అలవర్చుకొని ఉత్తమ శ్రేణి ఫలితాలను సాధించినప్పుడే లక్ష్యాలను చేరుకోగలరన్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకంతో విద్యా సంస్థల రూపురేఖలు మారిపోయాయని, ఆధునిక సాంకేతికతో కూడిన విద్య పేదలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించినప్పుడే సిఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు, ప్రభుత్వ ఆశయానికి సార్థకత కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగులమ్మ, ఉపసర్పంచ్ కేశవ రెడ్డి, వైసిపి నాయకులు చింతల వివేకానంద రెడ్డి, రవి నాయక్, అబ్దుల్ కలీమ్, నీళ్ల భాస్కర్, రాయుడు, రిజ్వానుల్లా, మదనమోహన్ రెడ్డి, రఘు, ఎంఇఒ వెంకటరత్నం, హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మదనపల్లె అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక పంపిణీ మంగళవారం నెహ్రూ మున్సిపల్ స్కూల్‌లో 23వ వార్డు కౌన్సిలర్ గిరిజసాయిశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మాట్లాడారు ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగు, డిక్షనరీ తోపాటు తదితర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతి విద్యార్థికి ఈ జగనన్న విద్యా కానుక పథకం వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జగనన్న విద్యా కానుక కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










