రాయచోటి : బిఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష అన్నారు. అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు రాయచోటిలోని పిసిఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ గిరీష, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, దళిత సంఘాల నాయకులు,అధికారులుతో కలసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతంలో జన్మించిన బిఆర్.అంబేద్కర్ దేశానికి దఢమైన రాజ్యాంగాన్ని అందించా రన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కనియడారు. విద్యార్థులు, యువత మహనీయుల జీవన చరిత్రలును తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. పేదలు, బడుగు, బలహీన, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల అర్హులందరికీ సంక్షేమ, అభివద్ధి పథకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అందరి సహకారంతో ఆదర్శ జిల్లాగా మారుస్తామన్నారు.జిల్లా కేంద్రం నడిబొడ్డున ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కావడం ప్రశంసనీయమన్నారు. అనంతరం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో ఉత్తమ సేవల అందించిన అధికారులు, సిబ్బందికి ఎంఎల్‌ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష ల చేతులమీదుగా ప్రశంసా పత్రాలు, మెమోంటో లు అందించి దుస్సాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జాకీర్ హుసేన్,జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శివశంకర్, కౌన్సిలర్లు షబ్బీర్, గౌస్ ఖాన్,అల్తాఫ్ పాల్గొన్నారు. కలకడ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కలకడ సిఐ నాగేంద్ర తెలిపారు. మండల కేంద్రమైన కలకల బస్టాండ్ ఆవరణములో 132వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మాల మహానాడు, మాల మహానాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐలు బాలకష్ణ, మోసెస్, పోలీసు సిబ్బంది, మాల మహానాడు అధ్యక్షుడు రజిని, గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ప్రధానో పాధ్యాయులు ఎన్‌పి నాగయ్య, నటరాజ, ఓబులేసు, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు దామోదరం మండల అధ్యక్షులు రెడ్డి కిరణ్, ఉపాధ్యక్షులు వెలుగు రెడ్డప్ప ,కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి: అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు, దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ లీలా మాధవి, పంచాయతీ కార్యదర్శి గిరిధర్ నాయక్, తహశీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సిఆర్.మంజుల, ఆర్‌ఐ రాంప్రసాద్, నిమ్మనపల్లి బస్టాండ్ లో దళిత సంఘాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అధికారుల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
నందలూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. బి.ఆర్.అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంపిపి మేడా విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జడ్‌పి చైర్మన్ ఆకేపాటి అమనాథరెడ్డిలు పాల్గొని ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పాటూరు గ్రామపంచాయతీలో హరిజనవాడను అంబేద్కర్ నగర్‌గా నామకరణం చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల కో-ఆప్షన్ సభ్యులు కలీం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్, వైస్ ఎంపిపి అనుదీప్, మాజీ సర్పంచులు శంకర్ రెడ్డి, వేల్పుల లక్ష్మీ దేవి, మాజీ ఎంపిటిసి స్వామి ఎలుమలై, వైసిపి నాయకులు పెనుబాల నాగ సుబ్బయ్య, కాకి చంద్ర, ఆర్ముగం విశ్వనాధ్, నడివీధి సుధాకర్, అక్కివెంకట రమణ, బలరాం, ఆకేపాటీ రమేష్ పాల్గొన్నారు. కలకడ: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సిహెచ్ నారాయణ, ఎపిఎం రమేష్, సర్పంచ్ ప్యారిజాన్ అలి ఖాన్, సెక్రెటరీ నందిని, జీలాని , మండల సమాఖ్య వారు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : మండలం టౌన్ పాత కోర్టు సమీపంలో జై భీమ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బాలరాజు, టీచర్ బేతాపురం రామాంజనేయులు, యువ నాయకులు గంగాధర్, నూకల రవీంద్ర, బిఎస్‌ఎన్‌ఎల్ శంకరయ్య పాల్గొన్నారు. కలికిరి: బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు మండలంలో అంబేద్కర్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జయరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ నాయకులు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐ లోకేష్ రెడ్డి ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్, జడ్పిటిసి పద్మజ లోకవర్ధన్, ఎంపిడిఒ గంగయ్య ఆధ్వర్యంలో, తాహశీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు యేసు రాజు ఆధ్వర్యంలో, మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గులాబ్జాన్ ఆధ్వర్యంలో, రెడ్డి జెఎసి నాయకుడు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధరణి హోటల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్రంకొండ : అంబేద్కర్ జయంతి ఘనంగా మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు నయని జగదీశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఏజ్.అహ్మద్, రెడ్డమ్మ, కొండ చైర్మన్ విజరు కుమార్, సాకే చిన్నప్ప, మాజీ సర్పంచ్ సుంకర శేఖర్, దద్దాల హరి ప్రసాద్ నాయుడు, చలమారెడ్డి, మేకల చలపతి, ఎల్లుట్ల మురళి పాల్గొన్నారు. తంబళ్లపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలో మరపురానివని ఎంఆర్‌పిఎస్ నాయకులు మల్లికార్జున, వైసిపి బిసి నాయకులు సురేంద్రలు కొనియాడారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. మొత్తానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో ఎంఆర్‌బిఎస్ నాయకులు గోపిదిన్నె మల్లికార్జున, హెడ్‌కానిస్టేబుల్ శంకర్ గోపాల్ పాల్గొన్నారు. బి.కొత్తకోట : నగర పంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఇ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, ఇఇ పి.చెన్నకేశవరెడ్డి, డిఇఇ సతీష్ కుమార్, ఎఇ ఆంజనేయులు, నగర పంచాయతీ అకౌంట్ ఆఫీసర్ బి.రమాదేవి, నగర పంచాయతీ సిబ్బంది రాంబాబు, అంజి, శివ, ఆవుల శ్రీనివాసులు హాజరయ్యారు. కార్యక్రమంలో సంకు హరికష్ణ, సబ్జీ, శ్రీనివాసులు, నక్క మహేష్, మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని జ్యోతి చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి కేక్ కట్ చేసి, బాణ సంచాలు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బాస్ మండల అధ్యక్షుడు పలక వెంకటేష్,బాస్ నాయకులు సింగన్న, సచిన్, గంగా, వెంకట్, చిన్నా, గోవర్ధన్, భాస్కర్, నరేష్, రవి, చిన్ను, వంశీ, గంగులప్ప, తరుణ్, మాధవ, సబ్జి, పలక గోవిందు, పురుషోత్తం, నరేంద్ర, గణేష్, నక్కా మహేష్ పాల్గొన్నారు.
రామసముద్రం: అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి రామసముద్రం మండల మాలమహానాడు అధ్యక్షులు అంబరీష్ ఆధ్వర్యంలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ కోవిదుడు, విశిష్టమైన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, అద్భుతమైన రచయిత, తిరుగులేని ఉద్యకారుడు, ప్రజలను కట్టి పడేయగల వక్త, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మానవతావాది, స్వేచ్ఛా సమానత్వ స్థాపనకోసం తపన పడ్డ,సామాజిక విప్లవకారుడు, స్వాతంత్య్ర భారత తొలి న్యాయశాఖా మంత్రి, రాజ నీతిజ్ఞులు, బోధిసత్వ, మహిళలు, కార్మిక హక్కుల ప్రధాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, ప్రముఖులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రామాపురం: మండల కేంద్రమైన రామాపురంలోని అంబేద్కర్ చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రామకష్ణ గౌడ్ నాగేందర్ రెడ్డి, సహదేవరెడ్డి, చాంద్ బాషా, ఎస్‌సి సెల్ విభాగం కార్యదర్శి వెంకటరమణ దర్బార్ శ్రీనివాసులు, నాగేశ్వరావు, బాలరామ్, బసిరెడ్డి, రాజారావు, గంప, శివయ్య వల్లపు రామానుజులు నగేష్ రవి శంకర్ రెడ్డి పెద్దన్నయ్య పాల్గొన్నారు. పెద్దమండ్యం : నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యరి శంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు మండల అధ్యక్షులు జిట్టా వెంకటరమణ అద్యక్షుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్‌ను కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని టిడిపి నాయకులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు రోడ్డు కాలనీ గేటు నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు వైవి శేఖర్ నాయుడు, అధ్యక్షులు రామలింగ, రాయలసీమ ప్రదాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో.. మదనపల్లి యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరాటే గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఎఆర్ సురేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్లు ఎం.మణిసాయి, కరాటే మాస్టర్లు, జోషితరెడ్డి, కరాటే విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










