అమెరికా : ఎక్కువ అవయవాలతో శిశువు పుట్టిందని తరచూ మనం వార్తలు వింటూనే ఉంటాం. అలాంటి వార్తల వీడియోలు కూడా హల్‌చల్ చేస్తుంటాయి. అరుదుగా అక్కడక్కడ మూడు కాళ్లు, మూడు చేతులు, రెండు తలలు ఇలా విభిన్నంగా శిశువులు పుడుతుంటారు.
ఈ తరహాలోనే అమెరికాలోని పెయిజ్ డిఎంజె అనే మహిళలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థలున్నాయి. రెండు గర్భాశయాలు, రెండు జననాంగాలు ఉన్నాయి. ఈ విషయం ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకూ తెలియలేదు. తరచుగా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుండటంతో ఆమె గైనకాలజిస్ట్ ను సంప్రదించింది. అప్పుడు అసలు విషయం తెలిసింది.
రెండు వేర్వేరు గర్భధారణ వ్యవస్థలు ఒకే శరీరంలో ఉండటంతో ఆమెకు నెలకు రెండు సార్లు పీరియడ్లు వస్తుంటాయి. ప్రతి రెండువారాలకు ఒకసారి పెయిజ్‌కు పీరియడ్స్ వస్తుండేవి. వైద్య పరీక్షల్లో తను ఉటెరెస్ డిడిల్పెజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్టు పెయిజ్‌కు తెలిసింది. ఈ స్థితి వల్ల పెయిజ్‌కు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. పిల్లల్ని కనాలని అనుకుంటే ఆమెకు సరోగసీ విధానమే మేలని వైద్యులు చెబుతున్నారు.
పెయిజ్ మాట్లాడుతూ.... ' నాకు పీరియడ్లు ఏ సమయంలో వస్తాయో తెలిసేది కాదు. కొన్ని సార్లు రోజుల వ్యవధిలో వచ్చేవి. నా హైస్కూల్ జీవితం అంతా ఇలాగే గడిచిపోయింది. వైద్యుల దగ్గరకు వెళితే అసలు విషయం బయటపడింది. నా శృంగార జీవితం గురించి చాలా మందికి ఆత్రుత ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. నాకు లైంగిక ఇబ్బందులేవీ లేవు. నాకు ఓ బారు ఫ్రెండ్ కూడా ఉన్నాడు. శఅంగార విషయంలో అంతా సవ్యంగానే ఉంది. అయితే నాకు పిల్లలను కనాలని ఉంది. ఇదే సమస్యతో బాధపడుతున్న కొందరు ఫేస్‌బుక్ ద్వారా నాకు పరిచయమయ్యారు. ఓ మహిళకు ఐదు గర్భస్రావాల తర్వాత.. ప్రసవం అయింది. నాలాంటి సమస్యతోనే బాధపడుతూ పిల్లలకు జన్మనిచ్చిన మహిళల గురించి వింటూ ఆశతో జీవిస్తున్నాను ' అని పెయిజ్ పేర్కొంది.










