Jan 16,2023 17:45

అలంకరణ తొడుగును అందిస్తున్న దాతలు విజయలక్ష్మి, సుధాకర్‌

ప్రజాశక్తి-నిమ్మనపల్లి : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీనేలమల్లేశ్వరస్వామికి అలంకరణ తొడుగును మదనపల్లి మిట్స్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి, ఆమె భర్త సుధాకర్‌ సోమవారం అందించినట్లు ఆలయ తాత్కాలిక కమిటీ సభ్యులు గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.72 వేలు విలువైన పంచలోహ అలంకరణ తొడుగును స్వామివారికి వితరణ చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ అర్చకులు శంకర శాస్త్రి, శివా స్వామి దాతలకు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు.