Jun 06,2023 21:14

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే

రాయచోటి : జగన్‌ పాలనలో ఆలయాలకు మహర్దశ కల్గిందని కలెక్టర్‌ గిరీష, వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కార్మిక, కర్మాగారాల, బాయిలర్ల, ఇన్సురెన్స్‌ వైద్య సేవల ప్రభుత్వ కార్యదర్శి హరిజవహర్‌ లాల్‌ నాయక్‌, కలెక్టర్‌ గిరీష, ఎస్‌పి గంగాధర్‌ రావ్‌ పేర్కొన్నారు. మంగళవారం సంబేపల్లె మండలం శెట్టిపల్లె పెద్దబిడికిలో రూ 26 లక్షలతో పెద్దబిడికిలోని మారెమ్మ ఆలయంలో పూర్తయిన ప్రాకారం, ప్లోరింగ్‌ నిర్మాణాల ప్రారంబోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆలయాల నిర్మాణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సిఎం జగన్‌ అపర శ్రీకష్ణ దేవరాయలుగా పేరొందారన్నారు. పెద్దబిడికి సమస్యలను ఎంఎల్‌ఏ శ్రీకాంత్‌ రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.పెద్దబిడికి, అడవికమ్మపల్లెలలో సెల్‌ టవర్లు లేక ఈ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరితగతిన సెల్‌ టవర్లు ఏర్పాటు చేయించాలని కోరారు. పెద్దబిడికిలో పొజిషన్‌ సర్టిఫికెట్లను త్వరగా మంజూరు చేయాలని కోరారు. కార్మిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి హరిజవహర్‌ లాల్‌ స్వగహంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో ఎమ్మెల్యే, కలెక్టర్‌,ఎస్‌పి పాల్గొన్నారు.
ప్రజలందరికీ శుద్ధిజలం అందించడమే ధ్యేయం
ప్రజలందరికీ శుద్ధి జలం అందించడమే తమ ధ్యేయమని కలెక్టర్‌ గిరీషా, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, కార్మిక, కర్మాగారముల, బాయిలర్ల, ఇన్సూరెన్స్‌ వైద్యసేవల ప్రభుత్వ కార్యదర్శి హరిజవహర్‌ లాల్‌ నాయక్‌ పేర్కొన్నారు. సంబేపల్లె మండలం పెద్దబిడికిలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కావడంపై ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమయ్యింది. కార్యక్రమాలలో డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి గొర్ల ఉపేంద్రా రెడ్డి, గొర్ల రమేష్‌ రెడ్డి, పంచాయితీ రాజ్‌ ఈ ఎన్‌ సి బాలూ నాయక్‌, సర్పంచ్‌ వెంకట రమణ నాయక్‌, ఆవుల మల్లికార్జున రెడ్డి, ఎంపిటిసిలు సీతమ్మ, శ్రీధర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవపట్ల వెంకట్రామిరెడ్డి, వివి ప్రతాప్‌ రెడ్డి, శ్రీనూ నాయక్‌,మహేంద్ర నాయక్‌,తిరుపాల్‌ నాయక్‌, రామూర్తి నాయక్‌, కిషోర్‌ రెడ్డి, మహేశ్వర,మాధవ నాయుడు, దేవాదాయ శాఖ జిల్లా అధికారులు విశ్వనాథ్‌, శంకర్‌ బాలాజీ, డిఇ గంగయ్య, ఇఒ లు కొండారెడ్డి, రమణా రెడ్డి, తహశీల్దార్‌ మహేశ్వరి భాయి, ఎంపిడిఒ నరసింహులు పాల్గొన్నారు.