దేవాలయానికి విరాళం అందిస్తున్న ఇంటూరి రాజేష్
ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు మండలం పలుకూరు పంచాయతీలో గల పత్తిపాటి వారి పాలెం గ్రామంలో ఉన్న శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మణానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ రూ. 2లక్షల విరాళం మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో బొడపాటి అనిల్ కుమార్, కందుకూరు మాజీ మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పొడపాటి వంశీ, మద్దినేని రాఘవయ్య, ఆలయకమిటి సభ్యులు పాల్గొన్నారు.










