కేంద్రంలోని బిజెపిప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉద్దేశ పూర్వకంగా నిర్వీర్యం చేస్తోంది. ప్రతియేటా బడ్జెట్ కుదింపు దగ్గర నుంచి డిమాండ్ పేరుతో కూలీలకు ఉపాధి పనుల కోత, రూ.23 అరకొర అలవెన్స్‌కు ఐదు గంటలు పని చేయాలనే ఆంక్షలు విధిం చడం, కొరముట్ల కొరత వరకు ఉద్దేశపూర్వకంగా నిర్జీవం చేస్తోంది. ఈలెక్కన రూ.60 మేర అలవెన్స్‌ను కుదించినట్లు లెక్కలు చెబుతుం డడం గమనార్హం. దీనికితోడు ఈయేడాది నుంచి ఎన్‌ఎంఎస్ సాఫ్ట్ వేర్‌ను రూప కల్పన చేసి రాష్ట్రప్రభుత్వ పరిధిలోని ఉపాధి హామీ వ్యవహారాల్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రప్రభు త్వాలు ఉపాధి కూలీ లకు కల్పిస్తున్న సదుపాయాలపై దాడి చేయడం మొదలుపెట్టింది. కేంద్రప్రభుత్వ ఇటీవలి విన్యాసాల కారణంగా ఉపాధికూలీల నోట్లోకి ఐదు వేళ్లను అమాంతంగా వెనక్కి లాగేయనుం డడం ఆందోళన కలి గిస్తోంది.ప్రజాశక్తి - కడపప్రతినిధి
జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలోని 19 పంచాయతీల్లో 73 ప్రదేశాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఇందులోభాగంగా శని వారం 4,100 మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. కేంద్రంలోని బిజెపి సర్కారు ఉపాధి పనుల్లో పారదర్శకత పేరుతో తెచ్చిన ఎన్ ఎంఎస్ సాఫ్ట్‌వేర్ కింద డిమాండ్ పొందిన ఉపాధి కూలీలు వారం లో నాలుగు రోజులు పనులకు హాజరై మిగిలిన మూడు రోజులు వెళ్లకపోతే వారం రోజులను ఉపాధి కల్పించినట్లు జమ చేస్తోంది. ఫలితంగా డిమాండ్ పొందిన కూలీలు మూడు రోజుల ఉపాధిని వదులుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
కోతలే..కోతలు
ఇటీవల ఉపాధి కూలి ప్రదేశాల్లో కూలీల సంరక్షణకు ఉద్దే శించిన సదుపాయాలను తుంగలో తొక్కింది. ఫలితంగా ఉపాధి కూలీలకు రూ.60 వరకు అలవెన్స్‌ను ఉపసంహరించుకుంది. ఫలి తంగా పెండ్లిమర్రి మండలంలోనే ఒక్కరోజుకు సంబంధించి రూ. 2.46 లక్షలు నష్టపోతున్నట్లు తేలుతోంది. వాటి వివరాలను పరి శీలిస్తే గతంలో ఉపాధి కూలీలు రూ.30 వేసవి అలవెన్స్, మేట్ అల వెన్స్ రూ.20, తాగునీటికి రూ. ఐదు, గడ్డపారకు రూ.ఐదు, తట్టా బుట్టకు రూ.ఐదు, మజ్జిగకు రూ.ఐదు, ఆటో ఛార్జీలకు రూ.20 చొప్పున చెల్లించడం తెలిసిందే. ఇందులో ఆటోఛార్జీలను మినహా యిస్తే వేసవి అలవెన్స్‌ను రూ.23 ఇస్తున్నట్లు చెబుతూ, ఐదు గంటల పాటు పని చేస్తేనే ఇస్తామని మెలిక పెట్టింది. ఎటు వంటి సదు పాయాలు లేని పనిప్రదేశాల్లో ఐదు గంటలు పని చేయడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా వేసవి అలవెన్స్ పొందే అవకాశం లేకు ండా పోయిందనే వాదన వినిపిస్తోంది. తాగునీటికి, మజ్జి గకు, గడ్డ పారకు, తట్టాబుట్టకు ఐదేసి రూపాయల చొప్పున ఇవ్వాల్సిన అల వెన్స్‌కు తుంగలో తొక్కింది.
వసతుల కల్పన ఒట్టిమాటే
ఉపాధి ప్రదేశాల్లో వసతుల కల్పన ఒట్టి భ్రమను తలపిస్తోంది. 2014లో ఇచ్చిన టెంట్లు, కొరముట్లు మరమ్మతులకు గురవడం, మరమ్మతులకు ఒక్క రూపాయిని విడుదల చేయక పోవడం, వస తుల కల్పన పర్యవేక్షించే మేట్లను తొలగించడం వంటి పనులతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోంది. దీనికి తోడు ఉపాధి కూలీ లకు సంరక్షనకు ఉద్దేశించిన మెడికల్ కిట్ దగ్గర నుంచి తాగునీరు, మజ్జిగ, గాయాల బారిన పడిన వారికి రూ.2,000 నుంచి రూ.50, 000 వరకు చెల్లించే పరిస్థితులకు కాలం తీరిపోయిందనే వాదన వినిపిస్తోంది.
కూలి అరకొరే!
2014 నుంచి కూలి పెరుగుదలకు నోచుకోవడం లేదు. 2014లో ఉపాధి కూలి రూ.272 ఉండగా, పదేళ్ల అనంతరం రూ. 272 ఉండడం గమనార్హం. ఏటా 15 శాతంపైగా ధరలు పెరుగు తున్న నేపథ్యంలో ఉపాధి కూలి రూ.600 పెరగాల్సి ఉంది. వాస్త వంలో సగటు కూలిని పరిశీలిస్తే రూ.254 మించి పడడం లేదని తెలుస్తోంది. నేలల్లో హార్డ్‌కోర్ పడడం, పనుల పరిమాణంలోని గుం తల లోతు, పొడవు పరిమాణాలను పెంచడం వంటి కారణాల రీత్యా కూలికి రూ.200 పరిమితమైంది. దీనికితోడు గ్రామాల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పనులు కల్పించడం పరిపాటిగా మారింది. పనుల ప్రదేశాలకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటో రాకపోకలకు రూ.20 చెల్లింపులను కలిపితే రూ.220 మించి పడడం లేదని తెలుస్తోంది. ఈలెక్కన ప్రతి ఉపాధి కూలి సుమారు రూ.60 వరకు కోల్పోవాల్సి రావడం విస్మయాన్ని కలిగిస్తోంది.
వసతి సదుపాయాలు కల్పించాలి
మండుటెండల్లో ఉపాధి పనులు చేయడం కష్టంగా ఉంది. కనీస వసతి సదుపాయాలైన టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ప్రాణాధార ఔషదాలను అందుబాటులో ఉంచాలి. వేసవిలో ఎండ తాకిడికి గురై తే తమ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుందని గ్రహిం చాలి.
పార్నపల్లి, రామసుబ్బమ్మ, కొత్తపల్లి, పెండ్లిమర్రి.
అలవెన్స్ షరతులు దారుణం
వేసవి అలవెన్స్‌ను కుదించడం దారుణం. మండుటెండల్లో ఐదు గంటలు పని చేస్తేనే అలవెన్స్ వర్తింపు చేస్తామనడం తగదు. ఇటువంటి పరిస్థితుల్లో తమకు ఇవ్వాల్సిన అలవెన్స్, కూలిపై షర తులు విధించడం అన్యాయం. విధిలేని పరిస్థితుల్లో చేస్తున్న మనుగడ కోసం చేస్తున్న కష్టాన్ని గుర్తించాలి.
నరసింహకుమార్‌రెడ్డి, యాదవాపురం, పెండ్లిమర్రి,
కూలి పెంచే వరకు పోరు
రూ.600 కూలి పెంచే వరకు పోరాటం చేస్తాం. పదేళ్ల నుంచి రూ.272 మించి పెంచకపోవడం దారుణం. ప్రతియేటా పెరుగు తున్న ధరల పరిమాణం మేరకు పెంపుదల ఉండాలి. వేసవి సీజన్ లో పదెకరాలు పొలం కలిగిన రైతులూ ఉపాధి పనులకు హాజరవు తున్న నేపథ్యంలో ఉపాధి పనులూ పెరగాలి, కూలి రేటును పెం చాల్సి ఉంది.
అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కడప.










