Mar 14,2023 22:06

గీతారావును సన్మానిస్తున్న డాక్టర్‌ కేశవులు, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : తల్లి పాల ప్రోత్సహం నినాదంతో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3700 కిలోమీటర్లు దూరం సైకిల్‌ యాత్రను గుజరాత్‌ రాష్ట్రం ఆహ్మాద్‌బాద్‌కు చెందిన అల్ట్రా సైక్లిస్ట్‌ గీతా రావు మార్చి 1న చేపట్టింది. ఈ యాత్ర మంగళవారం కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరింది. చిలమత్తూరు మండలం చెక్‌పోస్టులో బిపిఎన్‌ఐ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత చిన్న పిల్లల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ కేశవులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు. ఈ సందర్బంగా గీత రావు మాట్లాడుతు హైదరాబాదుకు చెందిన ధాత్రి సంస్థ సహకారంతో సైకిల్‌ యాత్ర చేపట్టమన్నారు. ముఖ్యంగా ఆధునిక యుగంలో పిల్లలకు తల్లులు పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం తల్లి పాలను ప్రోత్సహిసూత ఈయాత్రను చేపట్టమన్నారు. కన్యాకుమారిలో యాత్రను ముగిస్తామని చెప్పారు.