అల్ట్రా సౌండ్ స్కానింగ్ సిస్టం ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : కావలి రాజీవ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో మంగళవారం అల్ట్రా సౌండ్ స్కానింగ్ సిస్టమ్‌ను ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్యంకు, ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్‌లో కాన్పులకు వచ్చే మహిళలకు కాన్పు అయిన తరువాత రూ.5వేలు ఆర్థికసాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాతఊరు ప్రజలందరూ ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు జనిగిర్ల మహేంద్ర యాదవ్, మాజీ కౌన్సిలర్ కలగయ్య, సాహుల్, కుందుర్తి కామయ్య, కామరాజు, పుత్తూరు నాగచారి, కమ్మర్ బాబు, నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










