ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని బస్టాండ్ నుంచి విజయవాడ నగరానికి అల్ట్రా ఎక్స్‌ప్రెస్ (పల్లె వెలుగు) నాలుగు నూతన బస్సు సర్వీస్‌లను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్‌టిసికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సర్వీసులు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చామని, అలాగే పండుగ పేరుతో చార్జీలు పెంచి నిలువు దోపిడీ చేసే విధానానికి చరమగీతం పాడామని, డిపోలలో గానీ, బస్టాండ్ లలో గానీ అన్ని వసతులు అందుబాటులో ఉంచామని అన్నారు.
క్రీడా రంగాల్లో యువత రాణించాలి
పట్టణంలోని బివి సాగర్, ఎంసిసి నెట్స్ చెందిన సిహెచ్.సూర్యకుమార్, అనంత కార్తికేయ కృష్ణాజిల్లా అండర్-25 టీమ్‌కి ఎంపికైన సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి కావాల్సిన క్రికెట్ కీట్‌ను ఉదయభాను చేతుల మీదుగా కోచ్ రాజేంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ క్రీడా రంగాల్లో యువత రాణించాలన్నారు.










