ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి విద్యార్థులు ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన క్రీడా విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. బుధవారం హిల్ ఫ్యూ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వివిధ క్రీడ విన్యాసాలు ప్రదర్శించారు. మోటార్ సైకిల్ పై విన్యాసాలు, అగ్నిలో నుంచి బైకుల జంపింగ్, కత్తి సాము, కర్ర సాము, జిమ్నాస్టిక్స్, బంగ్రా నత్యాలు, ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం నాలుగు గంటలకు చిన్నారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్, సభ్యులు చక్రవర్తి ఈ విన్యాసాలను ప్రారంభించారు. ఈ విన్యాసాల్లో అనంతపురం, బందావన్, ముద్దునహళ్లి, బెంగళూరు, వైట్ ఫీల్డ్, పుట్టపర్తి, సత్య సాయి క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకతి అందాల నడుమ ఈ నత్య విన్యాసాలను పుట్టపర్తి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు సత్యసాయి భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్ పి రాహుల్ దేవ్ సింగ్, అదనపు ఎస్‌పి రామకష్ణ ప్రసాద్, డిఎస్‌పి యశ్వంత్, డిఆర్‌ఒ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.










