Feb 17,2023 22:07

ఫొటో : పాటల పోటీల్లో పాడుతున్న విద్యార్థిని

అలరించిన జె.వి.వి. పాటల పోటీలు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కావలి పట్టణంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు అధ్యక్షతన సైన్స్‌ వారోత్సవాలలో భాగంగా 5వ రోజున నిర్వహించిన సందేశాత్మక పాటల పోటీలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యజీవితంలో సైన్స్‌ను, పర్యావరణ పరిరక్షణను, దేశభక్తిని ప్రమోట్‌ చేసే విధంగా పాటల పోటీలను వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలలో 30 స్కూళ్ల నుండి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 6,7 తరగతుల విద్యార్థులను జూనియర్స్‌గా 8, 9, 10 తరగతుల విద్యార్థులను సీనియర్స్‌గా విభజించి, జూనియర్స్‌ విభాగానికి ఎస్‌.రామచంద్రరావు, టి.జయశ్రీలు న్యాయ నిర్ణేతలుగా, అదేవిధంగా సీనియర్స్‌ విభాగానికి స్వర్ణలత, ఎం.సాయి లక్ష్మీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
21వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రెడ్‌క్రాస్‌ భవనంలో జూనియర్స్‌కు, సీనియర్స్‌కు విడివిడిగా క్విజ్‌ పోటీలు జరుపబడుతుందని తెలియజేశారు. విద్యార్థులను ఈ పోటీల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ గాదిరెడ్డి.హరినాథ్‌, ఉపాధ్యక్షులు పాపిశెట్టి.జానకిరామ్‌, కందికట్టు నారాయణ, సంయుక్త కార్యదర్శులు ఎస్‌.కె.ఖాదర్‌బాషా, శ్రీకర్ల. వెంకయ్య, జన విజ్ఞాన వేదిక సీనియర్‌ సభ్యులు కె.జాన్‌, ఎస్‌.రమణయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.