Oct 13,2022 22:53

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: యువత తమ నూతన ఆలోచనలకు పదును పెడితే అద్భుతాలను సష్టించవచ్చని ఫోపల్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఎ.గోపీరాజు అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 'కస్టమైజేషన్‌ ఆఫ్‌ కమర్షిలైజడ్‌ అగ్రికల్చరల్‌ డ్రోన్స్‌' అంశంపై గురువారం వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో గోపీరాజు మాట్లాడుతూ విద్యార్ధులు ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా వాటిని సష్టించి వ్యాపార రంగాలపై దష్టిని పెట్టాలన్నారు. ఎదగాలి, విజయం సాధించాలి అనే సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. తొలుత అపజయాలు ఎదురైనా చిత్తశుద్ధితో కషి చేస్తే విజయాలు సొంతమవుతాయన్నారు. రానున్న కాలంలో డ్రోన్లకు విశేషమైన ఆదరణ ఉంటుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి విస్తతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు మాట్లాడుతూ నూతన ఆదునిక సాంకేతి పరిజ్ఞానం అభివద్ధిని సాధిస్తుందన్నారు. ఆ క్రమంలో డ్రోన్ల వినియోగం పెరిగిందన్నారు. డ్రోన్లకు సంబంధించి తమ కళాశాల డిప్లొమో కోర్సును అందిస్తుందన్నారు. అంతేకాకుండా డ్రోన్ల తయారీ, ప్రస్తుత మార్కెటింగ్‌ అంశాలపై వర్క్‌షాప్‌ను నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పీఎల్‌ రమేష్‌, ఏక్యూఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ జీ. కష్ణవేణి, అధ్యాపకులు హేమంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.