Jan 06,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి దర్శిగుంట శశిరేఖ

అల్లూరులో సర్వసభ్య సమావేశం
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపిపి దర్శిగుంట శశిరేఖ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ శ్రీదేవి మాట్లాడుతూ ఆయా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
గ్రామాలలో తాగునీటి సమస్య పారిశుధ్యం తదితర సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కార్యక్రమాలు తహశీల్దార్‌ శ్రీరామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు గుమ్మడి సురేంద్ర యాదవ్‌, ఇఒపిఆర్‌డి పెంచల వీరేంద్ర తదితరులున్నారు.