Feb 14,2023 20:20

ఆలకిస్తారా

ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా వ్యవసాయాధారిత ఆర్థికాభివృద్ధికి వెన్నెముక చెన్నూరు సహకార చక్కెర పరిశ్రమ. అటువంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమ పునరుద్ధరిస్తానని ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీ నీరోడుతోంది. ప్రతిపక్ష నాయకుని హోదా నుంచి నేటి వరకు జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి హోదాలో చేసిన శంకుస్థాపనల వరకు నిధుల విడుదల, పెండింగ్‌ పనుల పురోగతికి ఇచ్చిన హామీలు అమలుకు ఆమడదూరంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కడప నగరంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. కడప నగరంలో నాలుగు స్ట్రోమ్‌వాటర్‌ డ్రెయిన్లు, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ భవన నిర్మాణ ఏర్పాటు, జిజిహెచ్‌ సూపర్‌స్పెషాలిటీ సేవలు అమలుకు ఆమడ దూరంలో నిలవడం తెలిసిందే. రూ.454కోట్ల జిజిహెచ్‌ బోధనాస్పత్రి, సైక్రియాటిక్‌, కేన్సర్‌బ్లాక్‌, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ పనులు, రాజీవ్‌ పార్క్‌ పనులు, కొప్పర్తి పైప్‌లైన్‌ పనులు, హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు, గోపవరంలో సెంచూరి ఫ్లైవుడ్స్‌ పరిశ్రమలు, అడుగు ముందుకు పడని వైనం నెలకొంది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో కథనం.
చెన్నూరు చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు హామీ అటకెక్కింది. మూడు కమిటీలు ముచ్చటగా సర్వే చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గత పర్యటన సందర్భంగా పరిశ్రమ ఉద్యోగులకు సంబంధించిన రూ.16 కోట్ల పెండింగ్‌ బకాయిలు విడుదల చేసి, పునరుద్ధరణ పనుల పట్ల ఉదాసీనత వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
a 2007లో కీ.శే మాజీ ముఖ్యమంత్రి అప్పటి వైఎస్‌ సర్కారు తల పెట్టిన రూ.72 కోట్ల తో కడపలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ పెండింగ్‌లో పడింది. రాంకీ కాంట్రాక్టు సంస్థ టెండరును దక్కించుకుంది. 2015 నాటికి 68 శాతం పనులు పూర్తి చేసింది. ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌బి శాఖల అవాంతరాల నేపథ్యంలో చేతు లెత్తేసింది. టిడిపి సర్కారు 20 18లో హైద రాబాద్‌కు చెందిన శ్రీసాయి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి 108.41 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కాంట్రాక్టును దక్కించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది.
a రూ.305 కోట్లతో కడపలోని అన్న మయ్య సర్కిల్‌, గోకుల్‌ లాడ్జి సర్కిల్‌, మాసాపేట సర్కిల్‌, వైజంక్షన్‌ సర్కిల్‌లోని రహదారుల విస్తరణ పనులు టెండర్లు దశను దాటడం లేదు.
a రూ.70 కోట్ల విలువైన స్ట్రోమ్‌ డ్రెయి న్‌ల ఏర్పాటు హామీ అటకెక్కి ంది. ప్రతి ఏటా కురుస్తున్న వర్షాల ధాటికి నగరం మును గుతోంది. ఈనే పథ్యంలో కడపలో స్ట్రోమ్‌డ్రెయిన్‌ కాల్వల ఆక్రమణలను తొలగించి విస్త రణ పనులు చేపట్టడానికి ఇచ్చిన హామీ నిధులు లేక నీరోడుతోంది.
a రూ.454 కోట్ల విలువ కలిగిన జిజి హెచ్‌ బోధనాస్పత్రి, కేన్సర్‌, సైక్రియాటిక్‌, సూపర్‌ స్పెషాలిటీ హోదా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఎప్ప టికి పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
a రూ.345 కోట్లతో కూడిన ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ పనులకు ఆర్కి టెక్ట్‌ దశను దాట లేదు. ఫలితంగా యూనివర్శిటీ నిర్మాణం ఎప్ప టికి సాకా రమవుతుందో తెలియని దుస్థితి దాపు రించింది.
a రూ.12 కోట్లతో కూడిన హజ్‌హౌస్‌ పెండింగ్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలి యడం లేదు. నిధుల లేమి కారణంగా సకాలంలో పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్న వైనం నెలకొంది.
a రూ.150 కోట్ల విలువ కలిగిన కొప్పర్తి పారిశ్రామికవాడ నీటిపైప్‌ లైన్‌ పనులపై అయోమయం నెలకొంది. కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటుకు నీటి కొరత కారణంగా జంకుతోంది.
కొప్పర్తి పారిశ్రామికవాడలోని వైఎస్‌ఆర్‌ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఎప్పటికి కార్యక లాపాలు సాగిస్తాయో తెలియడం లేదు. చెప్పు కోదగిన రీతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన దాఖలా ల్లేవు.
a కడప, ప్రొద్దుటూరు పాల పరిశ్రమల కార్యకలాపాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. ప్రొద్దుటూరులో మూలన పడిన పాల పరిశ్రమ ఆస్తుల తనఖా పెట్టిన నేపథ్యంలో సుమారు రూ.90 కోట్లు చెల్లింపులకు నోచుకోకపోవడం లేదు. జగనన్న పాలవెల్లువ వంటి పథకంలో భాగంగా పునరుద్ధరణ కార్యకలాపాలను వేగవం తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
a కడపలో రెండవ ఆర్టీసీ డిపో, సిటీ బస్సుల సదుపాయాలు అందని ద్రాక్ష చందంగా ఊరిస్తుండడం గమనార్హం. జిల్లావాసే ఆర్టీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి రావడంతో ఆశాభావం వ్యక్తమవుతో ంది.
a రూ.12 కోట్లతో కూడిన బుగ్గవంక ప్రహ రీకి ఇరువైపులా రహదారి నిర్మాణ పనులు ఆశించిన రీతిలో సాగలేదు. బ్యూటిఫికేషన్‌, లైటింగ్‌ సిస్టమ్‌ వంటి పనులు ఎప్పుడు ఏర్పడ తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
a జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1లో భాగమైన సర్వ రాయసాగర్‌, వామికొండ, రిజర్వాయర్లు ఎప్పటికి సాకారమవుతాయో తెలియడం లేదు. ఇటీవల జిల్లా నీటిపారుదలశాఖ రూ.212 కోట్ల తో కూడ ిన ప్రతిపాదనలు పంపిం చినప్పటికి పాలనా పరమైన అనుమతుల మంజూరు కోసం నిరీక్షిం చాల్సి వస్తోంది.
a అన్నమయ్య రిజర్వాయర్‌ రూ.777 కోట్ల తో కూడిన పునరుద్దరణ ప్రక్రియ టెండర్ల దశను దాటడం లేదు. పింఛా ప్రాజెక్టు పునరుద్దరణ పనులు ఆచరణకు నోచుకోవడం లేదు.