అభినందిస్తున్న ఎస్‌పి
అభినందిస్తున్న ఎస్‌పి
ఆల్ ఇండియా సైకిల్ టూరిస్టుకు ఎస్‌పి అభినందనలు
నెల్లూరు:ఆల్ ఇండియా సైకిల్ టూరిస్టు కుమారి ఆష మాలవీయను ఎస్‌పి సిహెచ్ విజయరావు అభినందించారు. మహిళా సాధికారత , మహిళా భద్రతే ధ్యేయంగా సైకిల్ యాత్రను మధ్యప్రదేశ్ నుండి ప్రారంభించిన సైకిల్ రైడర్ కుమారి ఆష మాలవీయ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఆమె జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకొని మర్యాదపూర్వకంగా ఎస్‌పిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియా సైకిల్ టూర్ నవంబర్ 1, 2022 న మధ్య ప్రదేశ్ నుండి ప్రారంభించి 7 రాష్ట్రాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి నగరానికి చేరుకున్నామని తెలిపారు. ఆష మాలవీయ గారి సంకల్పాన్ని మెచ్చుకొని మీ ఆశయాన్ని చేరుకోవాలని సూచించి, ప్రోత్సాహకాన్ని ఎస్‌పి అందజేశారు.










