Mar 28,2022 15:55

ప్రజాశక్తి-భీమవరం : పట్టణంలో అఖిలభారత సమ్మె సందర్భంగా సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు టౌన్ కార్యదర్శి బి వాసుదేవరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు రేపు దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. వీళ్లకు మద్దతుగా అఖిల భారత రైతు సంఘం అఖిల భారత వ్యవసాయ సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. అంగన్వాడి ఆశా వర్కర్లు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతుంటే ఈ ప్రభుత్వం వారిని  ఇంటికి పంపాలని చూస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నాడు 10 వేల కోట్లతో ప్రారంభిస్తే నేడు రెండు లక్షల కోట్లు విలువ కలిగిన ఫ్యాక్టరీ గా ఉందని అంత విలువ కలిగిన ఫ్యాక్టరీని ఈ మోడీ ప్రభుత్వం నష్టాలు అనే పేరుతో ప్రైవేటు పరం చేద్దామని చూస్తుందని ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు మోడీ ప్రభుత్వం అంబానీ ఆదాని ఆస్తులు పెంచే ఆలోచన తప్ప కార్మికులకి న్యాయం చేసే ఆలోచన లేదన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 12 పోర్ట్ లను ఆదానికి కట్టబెట్టారని అన్నారు. బిఎస్ఎన్ఎల్ అంబానీకి బహుమతిగా ఇచ్చారని మోడీనీ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేసే పనులకు సహాయం చేస్తుందని ప్రజా సంక్షేమం కార్మిక సంక్షేమం ఆలోచన జగన్ కి లేదని విమర్శించారు. ఇదే పద్ధతిలో కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయమని ఆయన అన్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్లో పనిచేస్తున్న అంగన్వాడి ఆశ  ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ తదితర వాటిలో పనిచేస్తున్న కార్మికులకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనీస వేతనాల  బోర్డు ఈ దేశంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు బ్రతకాలంటే కనీస వేతనం రూ.26,000 ఉండాలని సూచించింది కానీ 21,000 రూపాయలు ఇస్తామని చెప్పి 9,200 రూపాయలు కనీస వేతనం అమలు చేస్తుందని 15సంవత్సరాల నుండి వేతన సవరణ చేయలేదని అన్నారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ పట్టాభి రామయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జరుగుతున్న ఈ సమ్మెకు యుటిఎఫ్ జిల్లా తరఫున మద్దతు తెలిపారు. నూతన విద్యా విధానం చట్టాన్ని పార్లమెంటులో  చర్చించకుండా ప్రవేశపెడతామని అనడం దారుణమని అన్నారు.జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేయాలని పేద బడుగు వర్గాలకు విద్యను దూరం చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. ఏ ఐ టి యు సి నాయకులు చల్లబోయిన రంగారావు , ఏ ఐ ఎఫ్ బి నాయకులు లంకా కృష్ణ మూర్తి, పోస్టల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లెనిన్ బాబు తదితరులు మాట్లాడారు. అనంతరం సభ ప్రాంగణం నుంచి వందలాది మంది కార్మికులు ర్యాలీగా బయల్దేరి ప్రకాశం చౌక్  మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ చేసి తమ నిరసన తెలిపారు.ఈ నిరసన కార్యక్రమం లో ఏఐటియుసి, టియుసిసి, రైస్ మిల్ యూనియన్, బజారు లాగుడు బండ్ల యూనియన్, పోస్టల్ యూనియన్ ,అంగన్వాడీలు, ఎల్ఐసి, ఏ ఎఫ్ బి గ్యాస్ వర్కర్స్ ఆశా వర్కర్లు మున్సిపల్ వర్కర్లు తదితర సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు