Feb 01,2023 18:45

వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :గుడ్లూరు మండలం చేవూరు చెరువుపొరంబోకు సర్వేనంబరు 879లోని భూమిని దొంగస్వామి రామదూత ఆక్రమణ చెర నుంచి స్వాధీనం చేసుకోవాలని ఎపి హేతువాదసంఘం అద్యక్షుడు నార్నెవెంకటసుబ్బయ్య కోరుతూ. కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు.సుమారు 25 ఏళ్ల నుంచి చెరువుపోరంబోకు భూమిని, ఆపక్కనే అనుకొని ఉన్న సర్వేనంబరు 883 లొని అటవీభూమిని రామదూత ఆక్రమించి ఆశ్రమం పేరుతో అనుభవి స్తున్నార న్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. దీనిపై తమ సంఘం లోకాయుక్తలో కేసువేసినందున్నారు. అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరి ఉషారాణి 2021 మే 28న ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకొవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. పిన్సిపల్‌ సెక్రటరి అదేశాలు ఎందుకు అమలు జరపలేదో తెలపాలని కోరారు. జిల్లా హేతువాదసంఘ సభ్యుడు వై .బాబురావు, జిల్లాహేతువాద సంఘ సభ్యుడు అహమ్మద్‌ ఉన్నారు.