అక్రమ కట్టడాలను తొలగించాలి
ప్రజాశక్తి-బిట్రగుంట : ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాన్ని తొలగించాలని ఎస్‌విపాలెం గ్రామ సర్పంచ్ వెంగమ్మ పేర్కొన్నారు. సోమవారం స్పందన సందర్భంగా సోమవారం ఎస్‌విపాలెం సర్పంచ్, ఎంపిటిసి నరసింహ, సిద్ధనపాలెం గ్రామస్తులు కలిసి ఎస్‌విపాలెం పంచాయతీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిపై తహశీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోగోలు మండలం ఎస్‌విపాలెం పంచాయతీ సర్వేనెంబర్ 124 ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇల్లు హైకోర్టులో పిటిషన్ వేశామని, హైకోర్టు వారు ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్‌కు, తహశీల్దారుకు ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని అక్రమంగా నిర్మించిన ఇల్లును సోమవారం మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. కోర్టులో ఉన్న ఇంటిని మరమ్మతులు చేయకూడదని చెప్పినా, వారు వినకుండా ఇంటి నిర్మాణం పనులు చేస్తున్నారని తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్.సునీల్, జి.శ్రావణ్ కుమార్, కె.వెంకటకృష్ణ, ఈ.గోపిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.










