రాయచోటి టౌన్ : కలెక్టరేట్ వద్ద అర్జీదారులకు, ప్రజలకు ఆకలి తీరుస్తుండడం ఆనందదాయకమని వైసిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ సౌజన్యంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కేంద్రాన్ని ఆయన సందర్శించి అర్జీదారులుకు, ప్రజలకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నలుమూల నుంచి గ్రీవెన్ సెల్ రోజున పేదలు కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాలకు వస్తుంటారని, భోజనాలకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నదానం పదివారాలుగా కొనసాగడం సంతోషకరమన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్నదాన కార్యక్రమానికి కొంతమంది దాతలు ముందుకు వస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకులు పల్లపు రమేష్, గాలివీడు వైస్ ఎంపిపి యదుభూషన్‌రెడ్డి, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, అన్నా సలీం, మాజీ వైస్ ఎంపిపి రమేష్ రెడ్డి, మహేష్ రెడ్డి, గంగిరెడ్డి, జావీద్, అమీర్, కొత్తపల్లె ఇంతియాజ్ పాల్గొన్నారు.










