Jul 07,2021 17:27

అమరావతి : ఎపి సిఎం జగన్‌మోహన్‌ రెడ్డికి వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు 'నవ సూచనలు' పేరుతో వరుస లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు తొమ్మిదో లేఖ కూడా రాశారు. ఐటి చట్టం సెక్షన్‌ 66ఎ కింద పోలీసు కేసుల నమోదును ఆపాలని లేఖలో ఆయన కోరారు. ఎందుకంటే ఆ చట్టం ద్వారా సామాజిక మాధ్యమాల కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నిజానికి ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంపై ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఎవరైనా తన ఫొటోను వారి ఫోన్‌లో డిస్‌ ప్లే చేస్తే లేదా మెసేజింగ్‌ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీసు స్టేషన్‌లకు పిలుస్తున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని కోరారు.