Jul 05,2023 21:56

గోడపత్రికలను విడుదల చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

హిందూపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు బడ్జెట్‌ను పెంచి ఆదుకోవాలని అంగన్‌వాడి యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లావణ్య డిమాండ్‌ చేశారు. ఈ నెల 10, 10వ తేదీల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు జరిగే ఆందోళన కార్యక్రమాలను విజవంతం చేయాలని కోరుతు బుధవారం ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్బంగా లావణ్య మాట్లాడుతు ఎన్నికల సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో హామీలిచ్చారన్నారు. అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి అయినా నేటికీ వాటిని నేరవేర్చలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. అలాగే గ్రాడ్యూటి అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ. 5 లక్షలు ఇవ్వాలని, రిటైడ్‌ అయిన తర్వత పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ లీడర్లు భాగ్యమ్మ, రత్నమ్మ, ధనమ్మ, పద్మ, గీతావాణి తదితరులు పాల్గొన్నారు.